![]() |
![]() |
.webp)
కూకు విత్ జాతిరత్నాలు ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కొన్ని ఎపిసోడ్స్ నుంచి గమనిస్తే హోస్ట్ ప్రదీప్ తో ఫ్లర్ట్ చేస్తూ ఉంటుంది గోమతి. గోమతి చేసే చిలిపి పనులకు ప్రదీప్ కూడా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటాడు. రాధ కూడా వీళ్లిద్దరి మీద సెటైర్స్ వేస్తూ ఉంటుంది. ఇక ఈ వారం ప్రోమోలో కూడా వీళ్ళు చాల స్పెషల్ గా కనిపించారు. గోమతి పద్దతిగా లంగా ఓణీ వేసుకుని వచ్చింది. చిన్నపిల్లలు తినే పసుపురంగు గొట్టాలను ఐదు వేళ్ళకు పెట్టుకుని "లక్ష్మి బావ లక్ష్మి బావా" అని పాడుకుంటూ వచ్చింది.
ఇక ప్రదీప్ ఐతే సిగ్గు మొగ్గలవుతూ "ఇదేంటి గోరింటాకు పెట్టుకుంటే ఎర్రగా పండాలి కానీ ఇలా అయ్యిందేంటి అన్నాడు." "అయ్యో ఇది గోరింటాకు కాదు మీకు ఇష్టం అని ఇలా పెట్టుకున్నాను" అని ఆ గొట్టాలని చూపించేసరికి ఆ గొట్టాలని ప్రదీప్ కరకర నమిలేశాడు. "కిచెన్ లో ఉంటుంది స్టవ్...చాలా చాలా బాగుంటుంది నా బావ నవ్వు" అంటూ గోమతి రెండు స్మైలింగ్ ఫింగర్స్ చూపించేసరికి ప్రదీప్ కూడా నవ్వేసాడు. రాధ గట్టిగా నవ్వేసింది. ఇక హరి ఐతే ఏంటి పెళ్లి బట్టలు కుట్టించేయమంటారా అంటూ ఫన్నీ కౌంటర్ వేసాడు. ఇక ఈ ప్రోమోలో స్పెషల్ గెస్ట్ గా వచ్చిన ఆలీ యాదమ్మ రాజు మీద ఫన్నీ సెటైర్స్ వేసాడు. గోమతి గతంలో "హిట్లర్ గారి పెళ్ళాం " అనే తెలుగు సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఇక ప్రదీప్ ఐతే ఒకప్పుడు ప్రతీ షోకి హోస్ట్ చేస్తూ ఉండేవాడు. కానీ మధ్యలో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ కోసం బుల్లితెర మీద గ్యాప్ తీసుకుని మళ్ళీ ఈ షో ద్వారా హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు.
![]() |
![]() |